తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకులు విషయానికొస్తే మొదటి పదిమందిలోనే మనకు వినిపించే పేరు పూరి జగన్నాథ్. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించి అలాగే స్టార్ హీరోలకి కూడా మరింత ఇమేజ్ తెచ్చే విధంగా ఎక్కువగా మాస్ సినిమాలు దర్శకత్వం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు పూరి జగన్నాథ్. అయితే పూరి జగన్నా థ్ కుమారుడు ఆకాష్ పూరి. తండ్రి దర్శకుడు కావడంతో తన చిన్నతనం నుండే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకాష్ పూరి సినిమాలో నటిస్తూ వచ్చారు. 2012 నాటికి ధోని అనే సినిమాతో ప్రకాష్ రాజ్ కుమారుడు గా నటించి ఒక యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు ఆకాష్ పూరి. ఆ తర్వాత ఆంధ్ర పోరి అయిన సినిమాతో హీరోగా డెబుట్ ఇస్తూ అదే వరుసలో కొంచెం టైం తీసుకుని మహబూబా, చోర్ బజార్, రొమాంటిక్ అనే సినిమాలతో ప్రేక్షకుల మన్నన పొందాడు. ఈరోజు తన పుట్టిన రోజు కావడంతో ఆకాష్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం అయిన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక విషయాన్ని వెల్లడించాడు. తన పేరు ఇకనుండి ఆకాష్ పూరి కాదు అని ఇకపై తన పేరు ఆకాష్ జగన్నాథ్ అంటూ వెల్లడించాడు.