ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సెన్సేషనల్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే మ్యూజికల్ హిట్ అయ్యింది. అదేవిధంగా, ఈ డెడ్లీ కాంబినేషన్లో సెకెండ్ మూవీ ఆల్బమ్ కూడా విడుదలకు ముందే చార్ట్‌బస్టర్‌గా మారింది. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న మణిశర్మ, మరో మాస్-ఆపీలింగ్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను స్కోర్ చేశారు.
ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ కి థంపింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు, సినిమా సెకెండ్ సింగిల్ మార్ ముంత చోడ్ చింత విడుదలైంది. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ పెక్యులర్ గా వున్నాయి, హైదరాబాద్ యాసలో అద్భుతంగా ఆకట్టుకున్నాయి.
ఇది దేశీ పార్టీ నంబర్‌కి వైబ్ ని యాడ్ చేస్తోంది, మణి శర్మ కంపోజిషన్ వెరీ నేటివ్ ఫోక్ తో ఆకట్టుకుంది. బీట్స్ చాలా హైగా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ హై ఎనర్జీని ఇస్తున్నాయి. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజన్ సీపాన, కీర్తన శర్మ త్రయం ఈ పాటకు వోకల్స్ అందించారు. వారి వోకల్స్ పాటలోని ఎనర్జీకి పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి.
రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవల్ లో వుంది. అతని డ్యాన్స్ కన్నుల పండువగా వుంది. హుక్ స్టెప్ ఇన్స్టంట్ గా పాపులర్ అయ్యింది. రామ్‌తో పాటు కాలు కదిపిన కావ్య థాపర్ ఈ పాటలో పెర్ఫెక్ట్ గ్లామర్ ని యాడ్ చేశారు, లైవ్లీ సెట్స్ లో షూట్ చేశారు. దేశీ పార్టీస్ టైంలో ఈ పాట ప్రతి ఒక్కరికీ ప్రైమ్ చాయిస్ అవుతుంది.
పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 15న గ్రాండ్ గా విడుదల కానుంది.
నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సిఈవో: విష్
సంగీతం: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి
స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా