కంటెంట్ ఈజ్ కింగ్ అని ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు నిరూపించాయి. కథ, కథనాలు బాగుంటే కొత్త నటీనటుల సినిమాలు అయినా మన తెలుగు ప్రేక్షకులు సూపర్‌హిట్ చేస్తారు. ఆ కోవలోనే స్ట్రాంగ్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘ద బర్త్‌డే బాయ్’. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో పలువురు నూతన నటీనటులు నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా పతాకంపై ఐ.భరత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విస్కి దర్శకుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌కు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల వేడుక బుధవారం హైదరాబాద్‌లో వినూత్నంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జబర్ధస్త్ ఫేం రోహిణి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ… ‘యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథ రాసుకున్నాను. నా జీవితంలో తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటనకు కథ రూపం ఇది. ఈ సినిమా నచ్చితే ఇద్దరికి చెప్పండి. నచ్చకపోతే పది మందికి చెప్పండి. నా అసలు పేరును, నా ఫేస్‌ను సినిమా విడుదలైన తరువాత రివీల్ చేస్తాను. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.
నిర్మాత ఐ.భరత్ మాట్లాడుతూ… ‘ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్రతి పాత్ర ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం కొత్తగా వుంటుంది.ఎం.ఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లినప్పుడు ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఐదుగురు స్నేహితులకు ఎదురైన అనుభవాలు, వాటి పర్యవసానాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి.ఈ సినిమా సహజత్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండబోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించాం. ఈ సినిమాతో నాకు పర్సనల్ మంచి కనెక్షన్ వుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ఈ నెల 19న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.
నటుడు రవికృష్ణ మాట్లాడుతూ సినిమా అంటే పిచ్చి వున్న టీమ్‌తో నటించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. తప్పకుండా సినిమా అందరికి కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు. ఈ చిత్రంలో తను నటించకపోయినా, సినిమా కోసం ఈ టీమ్ కష్టాన్ని చూసి వాళ్లకు ప్రమోషన్ సహాయం చేస్తున్నానని రోహిణి తెలిపారు. ఈ సమావేశంలో ఈ చిత్రంలో నటించన నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
తారాగణం : రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల, ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ తదితరులు.
నిర్మాత: ఐ.భరత్,
డీఓపీ : సంకీర్త్ రాహుల్
సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఆర్ వంశీ.జి
ఎడిటర్: నరేష్ ఆడుపా
సింక్ సౌండ్ డిజైన్: సాయి మణిధర్ రెడ్డి
సౌండ్ మిక్సింగ్: అరవింద్ మీనన్
మేకప్ చీఫ్: వెంకట్ రెడ్డి
డిజిటల్ మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు