యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జీరో టాలరెన్స్ ట్యాగ్ లైన్.
‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు.
‘భారతీయుడు 2’ ట్రైలర్‌లో సేనాపతి పాత్రతో పాటు డిఫరెంట్ లుక్స్‌లో కమల్ హాసన్ తనదైన అభినయాన్ని ప్రదర్శించారు. ఇక మర్మకళతో విలన్స్ భరతం పట్టడాన్ని కూడా ఈ సినిమాలో మరింత విస్తృతంగా చూపించినట్లు స్పష్టమవుతుంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ, అనిరుద్ సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాలను మరో లెవల్‌లో ఆవిష్కరించాయి. దీంతో సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ రూపొందిస్తోన్న భారీ బడ్జెట్‌తో ‘భారతీయుడు 2’ సినిమా ప్రపంచంలో ఓ సరికొత్త మైలురాయిని క్రియేట్ చేయటానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్షకుల్లో గొప్ప ఆలోచన రేకెత్తించేలా సినిమాలు చేస్తూ తన అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ జూలై 12న ఇండియన్ 2 పేరుతో తమిళంలో, భారతీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు:
కమల్ హాసన్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, పియుష్ మిశ్రా, గురు సోమసుందరం, డిల్లీ గణేష్, జయప్రకాష్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ తదితరులు
సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: ఎస్.శంకర్,
స్క్రీన్ ప్లే: ఎస్.శంకర్, బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్,
మ్యూజిక్ : అనిరుద్ రవిచంద్రన్,
ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్,
సినిమాటోగ్రఫీ: రవివర్మన్,
ఆర్ట్: ముత్తురాజ్,
స్టంట్స్: అనల్ అరసు, అన్బరివు, రంజాన్ బులట్, పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ,
డైలాగ్ రైటర్: హనుమాన్ చౌదరి,
వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: వి.శ్రీనివాస్ మోహన్,
కొరియోగ్రఫీ: బాస్కో సీజర్, బాబా భాస్కర్,
పాటలు: శ్రీమణి,
సౌండ్ డిజైనర్: కునాల్ రాజన్,
మేకప్ : లెగసీ ఎఫెక్ట్-వాన్స్ హర్ట్‌వెల్- పట్టణం రషీద్,
కాస్టూమ్ డిజైన్: రాకీ-గవిన్ మ్యూగైల్- అమృతా రామ్-ఎస్‌బి సతీషన్-పల్లవి సింగ్-వి.సాయి,
పబ్లిసిటీ డిజైనర్: కబిలన్ చెల్లయ్య ,
పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా),
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుందర్ రాజ్,
హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్,
రెడ్ జైంట్ మూవీస్: సెన్‌బగ మూర్తి,
నిర్మాత: సుభాస్కరన్