విశ్వ విఖ్యాత నట సర్వ భౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమారుడుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించి నందమూరి నట సింహగా గుర్తు సాధించుకున్న వ్యక్తి నందమూరి బాల కృష్ణ గారు. 1960 జూన్ 10వ తేదీన నందమూరి తారక రమారవు, బసవ తారకం దంపతులకు బాల కృష్ణ పుట్టారు. 1982 లో 22 సంవత్సరాలు వసుందర దేవి గారిని వివాహమాడారు. హైదరాబాద్ నిజాం కాలేజీ లో విద్యాబ్యాసం పూర్తి చేసారు. నటన మీద ఆయనకు ఉన్న ఆసక్తితో సినీ రంగం లోకి 70లలో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అప్పటినుండి 100 కు పైగా సినిమాలలో కథానాయకునిగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా తన తండి స్థాపించిన తెలుగు దేశం పార్టీ నుండి ఇప్పటికే 3 సార్లు ఆంధ్ర ప్రదేశ్ హిందూపూర్ గా గెలిచారు. అటు సినీ రంగంలోనే కాకుండా, ఇటు రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు బాలయ్య. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలలోని కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయన పుట్టినరోజును ఓ వేదుల జరుపుకుంటూ సంబరపడుతున్నారు.