సినీ నటి హేమ రేవ్ పార్టీ విష్యం మరో వైపు తిరిగింది. నటి హేమ గత నెల 20 వ తేదీన బెంగళూరు లోని ఓ ఫార్మ్ హౌస్ లో పార్టీ కి హాజరయ్యారు. ఆ ఫార్మ్ హౌస్ పై బెంగళూరు పోలీసులు రైడ్ చేయగా కొంత మంది ప్రముఖులు దొరికారు. ఆలా దొరికిన వారికి టెస్టింగ్ చేయగా మోత 86 మంది ఆ పార్టీ లో డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్టులు వచ్చాయి. అయితే వారిలో హేమ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంకై విచారణ కోసం నటి హేమకు సమన్లు ఇవ్వగా ఆమె హాజరు కాకపోవడం వాళ్ళ బెంగళూరు పోలీసులు నటి హేమాను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు సమాచారం. రేపు కోర్టుకు తీసుకువెళ్తున్నట్లు అంటుండగా రేపు ఓట్ల లెక్కింపు కారణంగా కోర్టుకు తీసుకుని వెళ్తారా లేదా అనేది వేచి చూడాలి.