ఈ మధ్య కాలంలో బాషా భేదం లేకుండా ఇతర పరిశ్రమకు చెందిన సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా మంచి కథ కథనంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటున్నాయి. అందులో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఈ మధ్యకాలంలో మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. అలా మన ముందుకు వచ్చిన మూవీ హిట్ లిస్ట్. తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్, సితార ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఇది. సూర్యకతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా పిట్ లిస్ట్. ఈవారం ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా రివ్యూ మీకోసం.
కథ:
విజయ్ (విజయ్ కనిష్క) తన అమ్మ (సితార), చెల్లి తో కలిసి ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఎవరితోనో గొడవలు పడకుండా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. జీవ హింస నేరం పాపమని భావిస్తాడు. అలాంటి తన జీవితంలో ఒకరోజు ఒక మలుపు తీసుకుంటుంది. ఒక రోజు తనకు ఒక కాల్ వస్తుంది. తన అమ్మని, చెల్లిని కిడ్నాప్ చేశానని వాళ్ళని వదిలి పెట్టాలంటే తాను చెప్పింది చేయాలి అని డిమాండ్ చేస్తాడు మాస్క్ మాన్. ఆ కిడ్నాపర్ నుంచి అమ్మని, చెల్లాయిని రక్షించడానికి విజయ్ ఇద్దరిని మర్డర్ చేయాల్సి వస్తుంది. ఈ కేసుని ఏసిపి యెజ్హ్వెందన్ (శరత్‌కుమార్) ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇంతకీ యెజ్హ్వెందన్ విజయ్ కి సపోర్ట్ చేశాడా లేదా? అసలు ఈ మాస్క్ మాన్ ఎవరు? విజయ్ అమ్మని, చెల్లిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? గౌతమ్ వాసుదేవ మీనన్ కి విజయ్ కి అలాగే సముద్రఖనికి విజయ్ కి సంబంధం ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే!
విశ్లేషణ :
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి హిట్ లిస్ట్ మూవీ ఒక కొత్త త్రిల్లింగ్ కాన్సెప్ట్ గా రిలీజ్ అయింది. మూవీ స్టార్ట్ అయిన కొంతసేపు స్లోగా ఉన్నా తక్కువ సమయంలోనే కంటెంట్ లోకి వెళ్లిపోయారు. కథలోకి వెళ్లిన అనంతరం ప్రేక్షకుడి ఆసక్తిగా ఎదురుచూసే అంశాలు చాలా ఉన్నాయి. హీరో విజయ్ తన తల్లిని చెల్లిని కాపాడుకోవడానికి మాస్క్ మాన్ చెప్పింది చేయడం. అదేవిధంగా శరత్ కుమార్ గారి క్యారెక్టర్ లోని పవర్ ఫుల్ నెస్. రామచంద్ర రాజు (కే జి ఎఫ్ గరుడ) క్యారెక్టర్ లోని విలనిజం. తల్లిని చెల్లిని కాపాడుకోవడానికి తాపత్రపడే సెంటిమెంట్ సీన్స్. కరోనా పాండమిక్ సమయంలోనే జరిగిన కొన్ని సంఘటనలు ఎమోషనల్ గా చూపించడం. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
నటీ నటులు:
విజయ్ కనిష్క కి ఇది మొదటి సినిమా అయిన నటన పరంగా మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా యాక్ట్ చేశాడు. శరత్‌కుమార్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కీ రోల్ ప్లే చేశాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, సముద్రఖని, సితార, రామచంద్ర రాజు (కేజిఎఫ్ గరుడ) తమ పాత్రలతో మెప్పించారు.
ప్లస్ పాయింట్స్ :
విజయ్ నటన
రెండో భాగం
శరత్‌కుమార్
నిర్మాణ విలువలు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్
మైనస్ పాయింట్స్ :
కథలోకి వెళ్లడానికి తీసుకున్న సమయం
ఫస్ట్ ఆఫ్ లో అక్కడక్కడ కొన్ని లాగ్ సీన్స్
వెర్డిక్ట్ : ఒక మంచి థ్రిల్లింగ్ సస్పెన్స్ రివెంజ్ డ్రామా