‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల,మనీష్ గిలాడ “ఏ మాస్టర్ పీస్” సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది.
ఈ రోజు “ఏ మాస్టర్ పీస్” సినిమా టీజర్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. జూన్ 7వ తేదీ మధ్యాహ్నం 3.33 నిమిషాలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అద్భుతమైన విజువల్స్, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులతో “ఏ మాస్టర్ పీస్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సుకు పూర్వజ్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదిలోనే “ఏ మాస్టర్ పీస్” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో యూనిక్ సూపర్ హీరో ఫిల్మ్ గా “ఏ మాస్టర్ పీస్” ఉండబోతోంది.
నటీనటులు – అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, మనీష్ గిలాడ, స్నేహ గుప్త, అర్చనా అనంత్, జయప్రకాశ్, చందు , తదితరులు.
టెక్నికల్ టీమ్ :
సినిమాటోగ్రఫీ- శివరామ్ చరణ్
సంగీతం- ఆశీర్వాద్
ఎడిటర్ – సుకు పూర్వజ్ ,మనోజ్ కుమార్. బి, శివ శర్వాని
కాస్ట్యూమ్స్ – ఉదయశ్రీ పూర్వజ్, సలీనా విలియమ్స్( యూకే)
స్టంట్స్ – రాజ్ కుమార్ గంగపుత్ర
పీఆర్వో – జీఎస్ కే మీడియా
బ్యానర్స్ – సినిమా బండి, మెర్జ్ ఎక్స్ ఆర్
నిర్మాత – శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ , ప్రజయ్ కామత్ రచన,
దర్శకత్వం – సుకు పూర్వజ్