‘మెట్రో’ ఫేమ్ ఆనంద కృష్ణన్ దర్శకత్వంలో ఎకె పిక్చర్స్ లేఖ నిర్మిస్తున్న చిత్రం “నాన్ వయొలెన్స్”. మెట్రో శిరీష్, బాబీ సింహా, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం యూనిక్ కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
సినిమా కథనం 90వ దశకంలో మదురై నగరంలో జరుగుతుంది. దర్శకుడు ఆనంద కృష్ణన్ ఆ కాలంలో మధురై జైలులో జరిగే సంఘటనల చుట్టూ ప్రధానంగా తిరిగే అద్భుతమైన స్క్రీన్‌ప్లేను రూపొందించారు. ‘మెట్రో’, ‘కొడియిల్ ఒరువన్’ చిత్రాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు ఆనంద కృష్ణన్ కు ఈ సినిమా హ్యాట్రిక్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
1990లలో జరిగే కథనం కావడంతో ఆ కాలాన్ని తెరపై యథార్థంగా రిక్రిఎట్ చేయడానికి ప్రొడక్షన్ టీం స్పెషల్ కేర్ తీసుకుంది. ప్రాప్‌లు, వార్డ్రోబ్ నుండి షూటింగ్ లొకేషన్ల వరకు ప్రతిది ప్రేక్షకులని తిరిగి ఆ కాలానికి తీసుకెళ్ళేలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమా అనుభూతిని అందిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. మెట్రో శిరీష్, బాబీ సింహా, & యోగి బాబు టైటిల్ క్యారెక్టర్స్‌లో నటిస్తుండగా, అదితి బాలన్, గరుడ రామ్, ఆదిత్య కత్తిర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.
సాంకేతిక సిబ్బంది :
రచన & దర్శకత్వం: ఆనంద కృష్ణన్
సంగీతం – యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ – ఎన్ ఎస్ ఉదయకుమార్
ఎడిటర్ – శ్రీకాంత్ ఎన్ బి
నిర్మాత – లేఖ (ఎకె పిక్చర్స్)
పీఆర్వో: వంశీ- శేఖర్