స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థగా లైకా ప్రొడక్షన్స్‌కి ఓ పేరుంది. తొలిసారి మలయాళ సినీ ఇండస్ట్రీలోకి లైకా ప్రొడక్షన్స్ ఓ భారీ బడ్జెట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రమే ‘L2 ఎంపురాన్’. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్‌కు ఎంతో కీలకమైనదనే చెప్పాలి. దక్షిణాదిలో టాప్ యాక్టర్స్‌తో కలిసి ఓ కొత్త సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండటం విశేషం.
2019లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ రూపొందుతుంది. తొలి భాగం హిట్ కావటంతో సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ముందుగానే అంచనా వేసిన మేకర్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నాయి. మోహన్ లాల్, వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్లో రానున్న మూడో చిత్రం కావటంతో అభిమానుల్లో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జయిట్మెంట్ ఇప్పటి నుంచే మొదలైంది.
మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్రమ్‌గా సూపర్‌స్టార్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఖురేషి పాత్రను పరిచయం చేయటంతో లూసిఫర్ సినిమా ముగుస్తుంది. ‘L2 ఎంపురాన్’ విషయానికి వస్తే ఆ పాత్రను మరింత విస్తృతంగా ఆవిష్కరించబోతున్నారు. స్టీఫెన్ నెడుంపల్లి అసలు ఖురేషి అబ్రమ్‌గా ఎలా మారాడనే విషయాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా పృథ్వీరాజ్ సుకుమార్ మోహన్‌లాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ ‘L2 ఎంపురాన్’ స్టైలిష్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్ డే లాలెట్టా అంటూ మోహన్ లాల్‌పై తన ప్రేమాభిమానాలను పోస్టర్ ద్వారా వ్యక్తం చేశారు పృథ్వీరాజ్.
పోస్టర్‌తో పాటు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూనే విడుదల చేసిన కొత్త పోస్టర్ లూసిఫర్ సీక్వెల్‌పై మరింత ఆసక్తిని పెంచింది. ‘L2 ఎంపురాన్’ పోస్టర్లో ఖురేషి అబ్రమ్‌గా మోహన్ లాల్ సరికొత్తగా కనిపిస్తున్నారు. కచ్చితంగా పృథ్వీరాజ్ సుకుమారన్ అభిమానులకు, ప్రేక్షకలకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనున్నారనే విషయం స్పష్టమైంది. ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగానుబంధం కూడా తెలుస్తుంది.
అలాగే ‘L2 ఎంపురాన్’ పోస్టర్‌తో లూసిఫర్ మూవీలో స్టీఫెన్ నెడుంపల్లి పాత్రను అందరికీ గుర్తు చేసింది. అందులో మోహన్ లాల్ తెల్లటి చొక్కా, పంచె ధరించి ఉంటారు. రాజకీయంగా తన అనుచరులను సెక్రటేరియట్ వైపు నడిపిస్తారు. ఖురేషి అబ్రమ్ విషయానికి వస్తే ఆ పాత్రలో మోహన్ లాల్ నల్లటి దుస్తులను ధరించి ఉన్నారు. అతని వెనుక ఏదో తెలియని రహస్యం దాగిందని తెలుస్తోంది.
లడఖ్, చెన్నై, కొట్టాయం, యుఎస్ మరియు యుకెతో సహా పలు చోట్ల సినిమా చిత్రీకరణ జరిగింది. టీమ్ ప్రస్తుతం తిరువనంతపురంలో షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే గుజరాత్, యుఎఇకి కూడా టీమ్ వెళ్లనుంది.
2025లో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘L2 ఎంపురాన్’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ రూ.500 కోట్ల కలెక్షన్స్‌తో అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మోహన్ లాల్ అభిమానులను, సినీ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా పెద్ద స్టార్స్, గొప్ప సాంకేతిక నిపుణుల కలయికగా ‘L2 ఎంపురాన్’ తెరకెక్కుతోంది. మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ విశేషాలు బయటకు రావటంపై అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు స్టీఫెన్ నెడుంపల్లి పాత్రలో మోహన్ లాల్‌ను బిగ్ స్క్రీన్‌పై చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నటీనటులు:
మోహన్ లాల్, టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్
సమర్పణ: లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్, ఆశీర్వాద్ సినిమాస్ ఆంటోని పెరుంబవూర్,
దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్,
నిర్మాతలు: సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్,
బ్యానర్స్: లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్,
రచన: మురళీ గోపి,
హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్,
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్,
మ్యూజిక్: దీపిక్ దేవ్,
ప్రొజెక్ట్ డిజైన్: పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్,
ప్రొడక్షన్ కంట్రోలర్: సిదు పనకల్,
ఆర్ట్: మోహన్ దాస్,
ఎడిటర్ : అఖిలేష్ మోహన్,
సౌండ్ డిజైన్: ఎం.ఆర్.రాజశేఖరన్,
యాక్షన్: స్టంట్ సిల్వ,
కాస్ట్యూమ్స్: సుజిత్ సుధాకర్,
మేకప్: శ్రీజిత్ గురువాయుర్,
స్టిల్స్ : సినత్ సేవియర్,
పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్-ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)