నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ మార్చి 18 నుంచి ప్రారంభం కానుంది. హీరో నానితో పాటు ఇతరతారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్ లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ పాటు కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీన్స్ సినిమాలో హైలెట్ గా వుండబోతున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ విడుదల కానుంది.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్