యూరోపియన్ న్యూరో బేస్డ్ మై స్కూల్ ఇటలీ సంస్థ జూబ్లీహిల్స్ లో ఇండియాలోనే తొలిసారిగా నేచర్స్ లాప్ పేరుతో ప్రీ స్కూల్, కిండర్ గార్డెన్ స్కూల్ ను ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లో ఏర్పాటుచేసిన ఈ స్కూల్ ని హనుమాన్ సినిమా హీరో తేజ సజ్జ ముఖ్య అతిథిగా విచ్చేసి 9వ నిజాం నవాబ్ రౌనత్ యార్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు గోడల మధ్య చదువుకు అలవాటు పడిన పిల్లలకు ఈ ప్రకృతి ఒడిలో పాఠాలు కొత్త అనుభూతినిస్తాయని అన్నారు. పిల్లలకు చిన్న వయసు నుంచే ప్రకృతికి మనకున్న అనుబంధాన్ని తెలియజేసేలా దీన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తాను తాను నటించిన హనుమాన్ మూవీకి ఇప్పుడే సీక్వెల్ చేయమని కొంత సమయం తీసుకుంటామని ఈ మధ్యలో వేరే సినిమాలు చేస్తామని అన్నారు. సంస్థ ఫౌండర్ చైర్మన్ ప్రసాద్ గారపాటి మాట్లాడుతూ ఇటలీ స్కూల్స్ లో ముఖ్యంగా సహజత్వానికి దగ్గరగా, ప్రాక్టికల్ గా పాఠాలు బోధిస్తారని, తనకు విద్యపై ఉన్న మక్కువతో ఈ ప్రకృతి ఒడిలో పాఠాలు అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చానని అన్నారు. రౌనత్ యార్ ఖాన్ కు చెందిన ఈ స్థలంలో రెండెకరాల విస్తీర్ణం లో చిన్నారులకు రంగులు, పూలు, పక్షులు ఇలా ప్రతి విషయాన్ని ప్రకృతిలో అండర్ ద స్కై అనే కాన్సెప్ట్ లో బోధిస్తామని అన్నారు. మరో ఏడాది కాలంలో 150 నూతన బ్రాంచెస్ ను తెరిచేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండి అపర్ణ వెల్లూరు, సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, ఇటాలియన్ ఎంబసీ ప్రతినిధి డాక్టర్ మరియా డానియల్ , ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ డాక్టర్ డి సుధాకర్ రావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.