షకలక శంకర్, రాజీవ్ కనకాల, శ్రీతేజ్, అక్సా ఖాన్, రూపిక ప్రధాన తారాగణంగా కాచిడి గోపాల్ రెడ్డి రచన దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్ రెడ్డి నిర్మించిన చిత్రం “దళారి”. ఈ చిత్ర ట్రైలర్ ను బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో అతిరథ మహారదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా
ముఖ్య అతిథి
సి . కళ్యాణ్ మాట్లాడుతూ… ట్రైలర్ చూస్తుంటే చాలా మాసివ్ గా ఉంది. వెంకట్ రెడ్డి గారు ఇండస్ట్రీ కు రావడం ఆనందించాల్సిన విషయం. కొత్త నిర్మాతలు ఇండస్ట్రీ కు రావాల్సిన విషయం ఎంతైనా ఉంది. కొత్తవారు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. టీమ్ అందరికీ మంచిపేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.
అతిథి రామ్ దాసు ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ… ట్రైలర్ చాలా బాగుంది.. మాస్ ఎక్కువ కనపడుతోంది. దాదాపు 4కోట్ల బడ్జెట్ తో తీసినట్టున్నారు. చిన్న సినిమా అంటే సి. కళ్యాణ్ గారు తప్పకుండా ఉంటారు. ఈ రోజు ఆయనతో దళారీ ట్రైలర్ లాంచ్ చేయించడం నిజంగా అభినందించాల్సిన విషయం అన్నారు.
ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ఈ ” దళారీ ” సినిమా ను ఆకృతి క్రియేషన్స్ పతాకంపై విడుదల చేయనున్నాము. సినిమా తీయడం ఎంత విలువ ఉంటుందో, టైం
వాల్యూ కూడా అంతే ముఖ్యం ఇందులో పని చేసిన వారందరూ చాలా ఇష్టం తో పని చేశాము. డిసెంబర్ 15న విడుదల చేయనున్నాం అన్నారు.
డైరెక్టర్ గోపాల్ రెడ్డి మాటలాడుతూ..
సొసైటీ లో ఏ పని జరగాలన్నా ఒక దళారీ అనే వాడు ఉంటాడు. అలాంటి దళారీ పాత్ర రాజకీయం లో ఉంటే ఎలా ఉంటుందో తెలిపేదే ఈ మా” దళారీ ” చిత్రం. ఇది మా సినిమానే కాదు అందరి సినిమా అని అన్నారు.
ముఖ్య అతిథులతో సహా ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, టి ఎన్ రాజు, సలీం, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గిరిదర్, జెమిని సురేష్, 80 ఇయర్స్ పృధ్వి, గెటప్ శ్రీను, రాంప్రసాద్, రచ్చ రవి, ఆర్. ఎక్స్. 100 లక్ష్మణ్, కృష్ణిశ్వర్ రావు, సురేష్ కొండేటి తదితరులు నటించిన ఈ చిత్రానికి
పి.ఆర్. ఒ. : బాబు నాయక్ (సినీ లోకం & సినీ సందడి), లిరిక్స్ : సుద్ధాల అశోక్ తేజ, సురేష్ గంగుల, సంగీతం : హరిగేర, డి.ఒ.పి. : మెంటం సతీష్,
ఎడిటర్ : నందమూరి హరి, స్టంట్స్ : పృధ్వి, కొరియోగ్రఫీ : రాజ్ పైడ, ఆర్ట్: రాజ్ అడ్డాల, ప్రొడక్షన్ : అల్లూరి రాము, రాజవంశీ, నిర్మాత : ఎడవెల్లి వెంకట్ రెడ్డి, రచన, దర్శకత్వం : కాచిడి గోపాల్ రెడ్డి.