తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారి 153 వ జయంతి సందర్భంగా ఆయన జయంతి వేడుకలను ఈరోజు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాలులో నేస్తం ఫౌండేషన్, పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో జె.వి.మోహన్ గౌడ్, నల్లపూసలు బాబ్జీ, వి.వి. రుషిక గారు కార్యనిర్వాహకులుగా ఘనంగా నిర్వహించారు… కార్యక్రమంలో అతిధులుగా హాజరైన పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ, మోహన్ వడ్లపట్ల, ఖాజా సూర్యనారాయణ, చంద్ర మహేష్, కూనిరెడ్డి శ్రీనివాస్ రఘుపతి వెంకయ్య నాయుడు గారు సినిమా అనే మూడు అక్షరాల అద్బుతం కనుకొన్న మొదటి రోజుల్లో సినిమాను ప్రజలకు చేరువ కావడానికి చేసిన కృషిని, సేవలను కొనియాడారు… కార్యక్రమంలో భాగంగా డిజిటల్ టెక్నాలజీని తెలుగు సినీ పరిశ్రమలో తీసుకురావడానికి కృషి చేసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొత్త బసిరెడ్డి గారిని, ఈ మధ్య కాలంలో కళారంగం ద్వారా పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్న కిన్నెర మొగిలయ్య గారిని, యడ్ల గోపాల్ రావు గారిని, ఎనిమేషన్ డైరెక్టర్ కొత్తపల్లి సీతారాము గారిని, సినీ నటులు, దర్శకులు, రచయితలు బల్లెం వేణుమాధవ్ గారిని, సినిమాపై రీసెర్చ్ చేసిన ఆబోతుల శ్రీనివాస రావు గారిని రఘుపతి వెంకయ్య నాయుడు స్మారక పురస్కారంతో సత్కరించుకోడం జరిగినది..