రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” రివ్యూ

సినిమా : నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”
రిలీజ్ డేట్ : అక్టోబర్ 14

న‌టీన‌టులు :

తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నా రెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌లురు న‌టించ‌గా

టెక్నికల్ టీం:

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. ముల్లేటి నాగేశ్వ‌రావు
నిర్మాత‌లు.. ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు
క‌థ‌-స్క్రీన్‌ప్లే- మాటలు ద‌ర్శ‌క‌త్వం.. వెంక‌ట్ వందెల‌
సినిమాటోగ్ర‌ఫి.. పి.వంశి ప్ర‌కాష్‌
సంగీతం.. సందీప్ కుమార్‌
స్క్రీన్‌ప్లే- పాట‌లు.. డాక్ట‌ర్ భ‌వ్య ధీప్తి రెడ్డి
ఎడిట‌ర్‌.. నంద‌మూరి హరి
స్టంట్స్‌.. రామ కృష్ణ‌
కొరియోగ్ర‌ఫి.. గ‌ణేష్‌ మాస్టర్, నండిపు రమేష్
పి .ఆర్. ఓ : మధు వి. ఆర్

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతూ చాలా హెల్ అట్మాస్ ఫియర్ లో ఉంది.అలాగే మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పడతారు అన్నట్టుఈ మధ్య వచ్చిన సినిమాలు నిరూపించాయి. మంచి కాన్సెప్ట్ తో ప‌ల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థతో వచ్చిన చిత్రమే “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై హుషారు, షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాలలో న‌టించిన తేజ్ కూర‌పాటి సోలో హీరోగా , అఖిల ఆక‌ర్ష‌ణ హీరోయిన్ గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 14న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ

పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు రైట్ సైడ్ ఉండే రావులపాలెం ప్రెసిడెంట్ కొడుకు రాధ (తేజ్ కూర‌పాటి), లెఫ్ట్ సైడ్ ఉండే జువ్వాలపాలెం ప్రెసిడెంట్ కూతురు కృష్ణ (అఖిల ఆక‌ర్ష‌ణ),ల మధ్య ఎలాంటి పరిచయం లేకున్నా ఆ రెండు ఊర్లకు వైరం పెట్టే జోగీ బ్రదర్స్ వీరిద్దరి మధ్య ఏఫైర్ ఉందని ఆరోపణలు చేయడంతో అందరూ నమ్ముతారు. అయితే హీరోయిన్ కృష్ణ వెంట పడకున్నా కూడా ఇలాంటి పుకారు షికారు చేయడంతో ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నంలో అనుకోకుండా కృష్ణని చూస్తాడు.ఇంట్లో వారి నాన్నతో గొడవ పడిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అనే విషయం రాధకు కు తెలియదు. కృష్ణ ను చూసిన తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. దాంతో రోజూ కృష్ణ కు తెలియకుండా రాధ వెంటపడుతుంటాడు,తనకు తెలియకుండా ఒక అబ్బాయి వెంట పడుతున్నాడన్న విషయం తనకు తప్ప ఊర్లో ఉన్న వారందరికీ తెలుస్తుంది.దీంతో వీరిద్దరి తల్లితండ్రులు పిల్లలతో గొడవ పడడంతో వీరిద్దరూ అనుకోకుండా తిరుపతి బస్ ఎక్కి వస్తారు. వీరికి తెలియని ప్రదేశం అవ్వడంతో వీరిద్దరిపై రౌడీలు దాడి చేసి కృష్ణ ను రేప్ చేయబోతే రాధ కాపాడతాడు. అప్పుడే అటుగా వచ్చిన కాలేజ్ చెర్మన్ అరుణ్ గోకలే (త‌ణికెళ్ళ భ‌ర‌ణి) వీరికి సెల్టర్ ఇచ్చి కాలేజ్ జాయిన్ చేసుకుంటాడు. అక్కడ రూమ్స్ లేని కారణంగా రాధ, కృష్ణలను ఒకే రూమ్ లో ఉంచుతాడు.ఒకే రూమ్ లో ఉండేందుకు ఇష్టపడని కృష్ణ దగ్గరకు ప్రిన్సిపల్ వచ్చి రాధ నాకు తెలుసు తను గే నువ్వేమి టెన్షన్ పడకు అని చెప్పడంతో తను ఒప్పుకుంటుంది.ఇలా ఒకే రూమ్ లో వుండడం వలన హీరోయిన్ కృష్ణ కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ? మరోవైపు ఇంట్లో నుండి వెళ్లిన పిల్లలు ఎక్కడికెళ్లారు అని కంగారు పడుతున్న తల్లి తండ్రులకు వీరిద్దరూ మర్డర్ అయినట్టు టీవీలో బాంబ్ లాంటి వార్త వస్తుంది.అసలు ఆ వార్తలో నిజమెంత? అసలు వీరిద్దరినీ మర్డర్ చేసే బలమైన కారణం ఏంటి? ప్రిన్సిపల్ చెప్పినట్టు నిజంగా రాధ ‘గే’ నా కాదా? చివరికి ఈ రాధ, కృష్ణలు కలుసుకుని ఒక్కటయ్యారా లేదా? అనేది తెలుసుకోవాలంటే “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
హుషారు, షికారు, రౌడీ బాయ్స్ సినిమాల తర్వాత సోలో హీరోగా రాధ పాత్రలో నటించిన తేజ్ కూరపాటి లో చాలా ఫైర్ వుంది. నటుడిగా చాలా ఈజ్ గా చేశాడు. ప్రేమలోనూ తను అన్ని బావోద్వేగాలను చాలా బాగా వ్యక్త పరచాడు.హీరోయిన్ గా నటించిన అఖిల ఆక‌ర్ష‌ణ కు మొదటి చిత్రమైనా చాలా చక్కగా నటించింది.ఇందులో హీరో, హీరోయిన్స్ ఇద్దరూ మన పక్కింటి అమ్మాయి, అబ్బాయి లాగా చాలా చక్కగా నటించారు.విద్యా సంస్థల అధినేత గా అరుణ్ గోకలే (త‌ణికెళ్ళ భ‌ర‌ణి,) కథను తన బుజస్కందాలపై మోసుకొని అటు నెగిటివ్ షేడ్ లోను పాజిటివ్ షేడ్ లోనూ చాలా బాగా నటించాడు. ఇన్స్పెక్టర్ గా జీవా, రాధ తల్లి తండ్రులుగా డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ లు, కృష్ణ తల్లితండ్రులుగా బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, మాధవి ప్రసాద్ లు, చాలా బాగా నటించారు. అలాగే హీరో ఫ్రెండ్స్ బాలు, మురళి,పవన్, హీరోయిన్ ఫ్రెండ్ తేజస్విని,క‌ల్ప‌నా రెడ్డి, జొగి బ్ర‌ద‌ర్స్‌ అందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ఇప్పుడు వస్తున్న సినిమాలకు డిఫరెంట్ గా ప్రాపర్ కంటెంట్ తో టైటిల్ లో వున్న కొత్తదనం సినిమాలో వుండేలా పర్ఫెక్ట్ చూసుకుంటూ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేస్తూ
ప‌ల్లెటూరి నేప‌ధ్యంలో యూత్ కి ఏమి కావాలో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థతో వినొదాన్ని మిక్స్ చేసి దర్శకుడు వెంక‌ట్ వందెల‌ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెర‌కెక్కించాడు. గణేష్ మాస్టర్, నండెపు రమేష్,ఇందులో ఐదు పాటలకు అద్భుతమైన కొరియోగ్రపీ చేశాడు.“పుడిమిని త‌డిపే తొల‌క‌రి మెరుపుల‌ చినుక‌మ్మా “. ఏ పోరి నా పోరీ చేశావే నీ చోరీ క్రేజీ సాంగ్ , రొమాంటిక్ గా సాగే ఏకాంత సమయం సాంగ్, నిలదీస్తుందా నీడ అనే బ్రేకప్ సాంగ్, రగిలే వయసు అనే ఐటమ్ సాంగ్స్ తో పాటు ఇందులో ఉన్న సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. భవ్య దీప్తి రెడ్డి రాసిన పాటలకు సంగీత దర్శకుడు సందీప్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ వంశీ ప్రకాష్ అందించిన విజువల్స్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. నందమూరి హరి చక్కని ఎడిటింగ్ చేశాడు. రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ , జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావులు సంయుక్తంగా నిర్మించిన “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా” సినిమా
ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉన్న ఈ సినిమా చివరవరకు ప్రేక్షకుడిని యంగేజ్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.ఇలాంటి ప‌ల్లెటూరి నేప‌ధ్యంలో సాగే చ‌క్క‌టి ప్రేమ‌ కథ వచ్చి చాలా రోజులయింది. నాకు తెలిసి “ఉయ్యాల జంపాల” తర్వాత వచ్చిన ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీ ఇదే అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.