ఆర్.పి.పట్నాయక్ – డైరెక్టర్ తేజ కాంబినేషన్ అనగనగానే చిత్రం మూవీ నుంచి మొదలుపెడితే అవునన్నా కాదన్నా వరకూ ఎన్నో హిట్స్ సాంగ్స్ గుర్తొస్తాయి. ఇప్పటికీ యూత్ ని అట్రాక్ట్ చేసే ఆల్బమ్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ నుంచి ఒక సినిమా బయటకి వస్తుంది అంటేనే మ్యూజిక్ లవర్స్ లో ఒక హైప్ ఉంటుంది. మావో పారిపోతున్నాది, గాజువాక పిల్లా, ప్రియతమా తెలుసునా, నువ్వు నేను, రాను రాను అంటూనే చిన్నదో, ఎందుకే ఇలా గుండె లోపలా ఇంత మంట రేపు తావు, అభిమన్యుడు కాదు వీడు, గుడి గంటలా నవ్వు తావేలా, అనగనగా ఒక ఊర్లో ఉందో గోరిక, నేలతల్లి గుండెలో ఎన్ని వేల కాంతులో లాంటి చార్ట్ బస్టర్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ అక్కడక్కడా వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ కాంబినేషన్ రిపీట్ అవబోతోంది. టాలీవుడ్ ప్రమముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తనయుడు, రానా దగ్గుబాటి సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం కానున్న మూవీకి డైరెక్టర్ తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ ని రంగం లోకి దించాడు. చిత్రం సినిమాకి సీక్వెల్ గా రానున్న మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో మొదలుపెట్టిన తేజ, తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు. దర్శకుడు తేజ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ లకి గేయ రచయిత చంద్రబోస్ కూడా కలిసి ఈ చిత్రానికి ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఈ ముగ్గురి కలయికలో అభిరామ్ ఫస్ట్ మూవీ తప్పకుండా మ్యూజికల్ బొనాంజగా ఉండబోతుంది.