బి.కె.ప్రొడక్షన్ పతాకంపై శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం దమ్మున్నోడు
. దుమ్ముదులుపుతాడు ట్యాగ్ లైన్. బాలాజీ కొండేకర్ , రేణుక కొండేకర్ నిర్మాతలు. ప్రియాంశ్, గీతాంజలి, స్వప్ప హీరోయిన్స్. ఈ చిత్రం ఈ రోజు హైదరాబాద్లోని రాక్ క్యాసిల్ హోటల్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా మరో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన ప్రాత్రికేయుల సమావేశంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…జొన్నలగడ్డ శివ ప్రతి సినిమాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అభిరుచి గల దర్శకుడు. చిన్న బడ్జెట్ లో పాటలు, ఫైట్స్ గ్రాండ్ గా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. టెక్నికల్ వాల్యూస్ తో సినిమా రూపొందిస్తాడు. ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటూ ప్రాణం పెట్టి సినిమాలు చేస్తూ పబ్లిక్ స్టార్ గా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు
అన్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…సినిమా ప్రారంభోత్సవాలకు, సక్సెస్ మీట్స్ కు పిలుస్తుంటాడు తప్ప ఒక సమస్య వచ్చిందనో, ఏదైనా సహాయం చేయండనో శివ ఎప్పుడూ మా దగ్గరకు రాలేదు. తనతో సినిమాలు చేసే నిర్మాతలతో మంచి రిలేషన్స్ మెయిన్ టైన్ చేస్తూ వారితోనే కంటిన్యూయస్ గా సినిమాలు తీస్తుంటాడు. ఆయన ప్రతి సినిమాకు పవర్ ఫుల్ స్టోరీతో పాటు పవర్ ఫుల్ టైటిల్స్ పెడుతూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంటాడు. దమ్మున్నోడు టైటిల్ చాలా బావుంది. కోవిడ్ సమయంలో కూడా సినిమా చేస్తూ ఎంతో మందికి పని కల్పిస్తోన్న శివను అభినందిస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా
అన్నారు.
హీరో-డైరక్టర్ శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ…నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రోత్సహిస్తూ వస్తోన్న ప్రసన్న కుమార్ గారికీ, రామసత్యనారాయణ గారికీ, ఫిలించాంబర్ వారికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కథ, టైటిల్ నచ్చి మా నిర్మాత బాలాజీ గారు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. పవర్ ఫుల్ స్టోరి, మాస్ ఎలిమెంట్స్, భారీ ఫైట్స్, సాంగ్స్ తో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ రోజు ఫైట్ తో షూటింగ్ ప్రారంభించాం. ఇప్పటి వరకు నాకు ఫైట్స్ పరంగా మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో డాన్స్ పరంగా కూడా పేరొస్తుందన్న నమ్మకం ఉంది. ఇందులో నాలుగు పాటలు అద్భుతంగా కుదిరాయి. మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేస్తాం
అన్నారు.
నిర్మాత బాలాజీ కొండేకర్ మాట్లాడుతూ…సొలో ప్రొడ్యూసర్ గా నాకిది తొలి సినిమా. గతంలో `సూపర్ పవర్` చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించా. దమ్మున్నోడు కథ, టైటిల్ నచ్చి నిర్మిస్తున్నా. ఇందులో ఏడు భారీ ఫైట్స్, నాలుగు అద్భుతమైన పాటలు ఉంటాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించడానికి ప్లాన్ చేశాం
అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎల్.ఎమ్ ప్రేమ్ , కొరియోగ్రాఫర్ బ్రదర్ ఆనంద్, హీరోయిన్ ప్రియాంశ్ పాల్గొని అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహంతి, కుమారిశ్రీ, గణేష్, శశాంక్, బాలాజీ కొండేకర్, బాల నటులుగా రాజేశ్వరి కొండేకర్, రాజ్ నందిని కొండేకర్, స్నేహాల్, కొండేకర్ తదితరులు నటిస్తోన్న ఈచిత్రానికి సంగీతంః ఎల్. ఎ మ్ ప్రేమ్; పాటలుః బాలాజీ కొండేకర్; డాన్స్ః బ్రదర్ ఆనంద్; సమర్పకులుః రాజేశ్వరి కొండేకర్, రాజ్ నందిని కొండేకర్, స్నేహాల్ కొండేకర్; నిర్మాతలుః బాలాజీ కొండేకర్, రేణుక కొండేకర్; కథ-మాటలు-స్ర్కీన్ ప్లే-డైరక్షన్ః శివ జొన్నలగడ్డ.