గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ కేఆర్ గారు నిర్మించిన ‘ట్రూ’ మూవీ పోస్టర్ లాంచ్ ప్రముఖులు టి.ఎన్ ఆర్ గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో హీరో హరీష్ వినయ్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గారు, డైరెక్టర్ శ్యామ్ మండల గారు మరియు ఈ మూవీ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మణికంఠ గారు పాల్గొన్నారు.
పోస్టర్ లాంచ్ చేసిన టి.ఎన్ ఆర్ గారు ఈ ట్రూ సినిమా గురించి మాట్లాడుతూ ” ఈ ట్రూ సినిమా ని అమ్మమ్మ గారిల్లు ప్రొడ్యూసర్ కేఆర్ గారు నిర్మించారు. మంచి టేస్ట్ ఉన్న నిర్మాత అయన. ఎక్కడా కాంప్రమైస్ కాకుండా ఈ సినిమా ని నిర్మించారు. ఈ సినిమా లో నేనొక మంచి రోల్ ప్లే చేశాను. ఈ సినిమా దర్శకుడు శ్యామ్ మండల నాకు బాగా పరిచయం. ఈ మూవీ మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా తీశాడు. డెఫినిట్ గా ఈ సినిమా తర్వాత పెద్ద దర్శకుడు అవుతాడు మరియు ఈ సినిమా లో హీరో, హీరోయిన్ లు హరీష్ వినయ్, లావణ్య లు చాలా బాగా చేశారు. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది ” అంటూ ట్రూ మూవీ టీమ్ కి బెస్ట్ విషెస్ చెప్పారు.
హీరో హరీష్ వినయ్ మాట్లాడుతూ ” బైలంపుడి నా మొదటి సినిమా, ఈ ట్రూ మూవీ నా సెకండ్ మూవీ. నా మీద నమ్మకముంచి నన్ను హీరోగా ఎంపిక చేసుకున్నందుకు ప్రొడ్యూసర్ కేఆర్ గారికి, డైరెక్టర్ శ్యామ్ మండల గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. అలాగే పోస్టర్ లాంచ్ చేయడానికి వచ్చిన టి.ఎన్ ఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.. .
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు పామరాజు మాట్లాడుతూ ” ఈ ట్రూ మూవీ కి నిర్మాణ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ ఎడిటింగ్ కూడా నేనే చేశాను. బేసికల్ గా నేను ఎడిటర్ ని. ఈ ట్రూ మూవీ కాన్సెప్ట్ నచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను” అంటూ ఈ సినిమా పోస్టర్ లాంచ్ చేయడానికి వచ్చిన టి.ఎన్ ఆర్ గారికి మా ట్రూ మూవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
డైరెక్టర్ శ్యామ్ మండల గారు మాట్లాడుతూ ” నాకు దర్శకుడిగా ఈ ట్రూ మూవీ మొదటి సినిమా.. నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాకీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కేఆర్ గారికి మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకి రామారావు గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ట్రూ మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఎక్కడా డీవియేట్ అవకుండా హోల్ మూవీ ఎంగేజింగ్ గా రన్ అవుతుంది. డెఫినిట్ గా ట్రూ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని నా నమ్మకం.. ఇక
ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ పిలవగానే రావడానికి ఒప్పుకున్న మా శ్రేయోభిలాషి టి.ఎన్ ఆర్ గారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక కృతజ్ఞతలు” అంటూ ముగించారు.
నటీనటులు :
హరీష్ వినయ్, లావణ్య , మధుసూదన్, టి.ఎన్ ఆర్ , డీఎస్ రావు మణికంఠ,మహేంద్రనాత్ హెచ్ ఎమ్, శుభోదయం సుబ్బారావు, బ్రాహనందరెడ్డి మరియు బాహుబలి కల్పలత లు ముఖ్య పాత్రలు పోషించారు.
సాంకేతిక నిపుణులు :
కెమెరా : శివారెడ్డి
మ్యూజిక్ : ఎంజికె ప్రవీణ్
ఎడిటింగ్ : జేపీ
ఫైట్స్ : శంకర్
డాన్స్ : కపిల్
కాస్ట్యూమ్స్ : చంద్రబోస్
ఎస్ఎఫ్ఎక్స్ : వెంకట్
విఎఫ్ఎక్స్ : చందు, శ్రీను
పాటలు : శశి పల్లె, విశ్వనాధ్
ఆర్ట్ : పివి రాజు
మేకప్ : నాయుడు
స్టిల్స్ : శ్రీనివాస్, కురుమూర్తి
ఆడియోగ్రఫీ : పద్మారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జానకిరామారావు పామరాజు
ప్రొడ్యూసర్ : కేఆర్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ : శ్యామ్ మండల.