Vakeelsaab: బ‌ద్రిలో నందా.. వ‌కీల్‌సాబ్‌లో నందాజీ.. డైరెక్ట‌ర్ క్లారిటీ!

Vakeelsaab: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో బద్రి చిత్రం తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే.. ఇందులో ప్ర‌కాశ్ రాజ్ నంద‌గా క‌నిపించారు. అయితే ఈ సినిమాలో ఓ సీన్‌లో భాగంగా ప‌వ‌న్‌- ప్ర‌కాశ్ రాజ్ గొడ‌వ‌ప‌డుతూ.. నేను ఎవ‌రో తెలుసా నందా అని ప్ర‌కాశ్ రాజ్ అంటే.. నువ్ నందా అయితే ఏంటీ నేను బ‌ద్రి బ‌ద్రినాధ్ అంటూ ప‌వ‌న్ చెప్పే డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రించింది.. కాగా ఈ సీన్ మ‌రోసారి రిపీట్ అయింది.. కానీ నందా కాస్త నందాజీగా మారింది..

Power

ప‌వ‌న్ ప్ర‌స్తుతం న‌టించిన వ‌కీల్ సాబ్ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ భాగంగా ఇటీవలే ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇందులో పవ‌న్ ప్ర‌కాశ్‌రాజ్‌ను నందాజీ అంటారు.. దీంతో మ‌రోసారి ప్ర‌కాశ్‌రాజ్ నందాజీగా ప‌వన్ చిత్రంలో క‌నిపించ‌నున్నారు. దీనిపై తాజాగా ఈ చిత్ర డైరెక్ట‌ర్ శ్రీ‌రామ్ వేణు స్పందిస్తూ.. తాను బ‌ద్రి సినిమా నుంచే ప‌వ‌న్ గారికి ఫ్యాన్‌.. ఆ సినిమాలో ప‌వ‌న్ ప్ర‌కాశ్ రాజ్‌ను నందా అంటారు.. దీంట్లో గౌరవంతో నందాజీ అంటారు అని తెలిపాడు. ‌