GHMC: జీహెచ్ఎంసీ ప్రజల్లారా.. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో వందల కేసులు పెరుగుతున్నాయి.. గతేడాది కరోనా ఎలా విజృంభించిందో మనకు తెలిసిన విషయమే.. ఏకంగా రోజుకు వెయ్యికి పైగా కరోనా కేసులు పెరిగాయి.. దీంతో నిరుపేదలు, రోజూ వారీ కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా ఎంతోమంది కరోనా సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డారు.. ఇక మనకు తెలింది ఒక్కటే.. కరోనా నుంచి మనం చాలా జాగ్రత్తలు పాటించాలి..
శానిటైజ్ చేసుకోవడం, గుంపులు గుంపులుగా ఉండద్దు, మరీ ముఖ్యంగా మాస్క ధరించడం వంటి కరోనా నిబంధనలు పాటించాలి.. ఈ విషయంలో తాజాగా జీహెచ్ఎంసీ ఓ వ్యక్తికి భారీ జరిమానా విధించింది.. హైదరాబాద్‌లోని ఓ ప్రాంతలో మాస్క్ పెట్టుకోకుండ బయట కనిపించిన వ్యక్తికి ఏకంగా 2000 రూపాయలు జరిమానా విధించింది జీహెచ్ఎంసీ.. దీనికి సంబంధించిన చలాన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అధికారులు. ప్రస్తుతం చలాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.