Nagababu: మెగా బ్రదర్ నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లిపై ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆయన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటాడనే విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీకి సంబంధించిన, తనకు ఏదైనా ఆకట్టుకున్న అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. ఈ నేపథ్యంలో నాగబాబును లైవ్లో వరుణ్ పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనికి తన దైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు Nagababu నాగబాబు.
వరుణ్ పెళ్లి ఎప్పుడు అని అడిగిన అభిమానికి సమాధానమిచ్చాడు నాగబాబు.. మంచి సంబంధాలు ఉంటే చూడండి అంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే మరో అభిమాని వరుణ్ని ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఇష్టపడితే ఆమెను వరుణ్ ఇష్టపడితే మీరు ఏమంటారు అంటూ ప్రశ్నించగా.. మీకు మీకు ఓకే అయితే నేనేమంటా అంటూ సమాధానం ఇచ్చాడు నాగబాబు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.