Mega Family: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రాంచరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మెగాస్టార్ పెద్ద కూతురు సుశ్మిత కొణిదెల ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నారు. అలాగే చిన్న కూతురు శ్రీజ ప్రస్తుతానికి తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తుంది.
కాగా ఈ అక్కాచెల్లెళ్ల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్న మహాశివరాత్రి సందర్భంగా వీరిద్దరు సరికొత్తగా తమని తాము ఆవిష్కరించుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలతో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించారు. చీరలో ఎంతో సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే..గ్లాసెస్ ధరించి వారి హోయల అందాలను చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.