Bollywood: తుఫాన్ టీజ‌ర్‌పై మ‌హేశ్‌బాబు ప్ర‌శంస‌లు..

Bollywood: బాలీవుడ్ నిర్మాత‌, న‌టుడు, సింగ‌ర్ ఫ‌ర్హాన్ అక్త‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం తుఫాన్‌. రాకేశ్ ఓం ప్ర‌కాశ్ మిహ్రా ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఈ చిత్రం బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. వీరిద్ద‌రు కాంబినేష‌న్‌లో గ‌తంలో భాగ్ మిల్ఖా భాగ్ చిత్రం రూపొంది బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం న‌మోదు చేసుకుంది. ఇప్పుడు మ‌రోసారి వీరి కాంబోలో వ‌స్తున్న తుఫాన్Bollywood చిత్రానికి సంబంధించి తాజాగా టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

maheshbabu

ఇప్పుడు ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రిస్తోంది. ఈ టీజ‌ర్‌పై సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ప్ర‌శంస‌లు కురిపించారు. తుఫాన్ టీజ‌ర్ చాలా బాగుంది. మ‌రోసారి ఫ‌ర్హాన్ అక్త‌ర్ త‌న ప‌ర్‌ఫార్మెన్స్ చూపించారు. న‌మ్మ‌శ‌క్యం కాని ప‌రివ‌ర్త‌న‌. సినిమా చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఉన్నాను అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు మ‌హేశ్‌బాబు. ఇక ఈ చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా మే 21న అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల కానున్న‌ట్లుBollywood చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.