‘గజిని’, యముడు, సింగం లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిర్మించిన చిత్రం ‘ఎన్.జి.కె(నంద గోపాల కృష్ణ)’. ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ‘ఏమైంది ఈవేళ’, అధినేత , బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ అందిస్తున్నారు. ఈ చిత్రం మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో….
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ – ”ఎన్.జి.కె తెలుగు వెర్షన్ మే 31న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మా బ్యానర్లో విడుదలవుతుంది. సూర్య, సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబుతో పాటు శ్రీ రాఘవ గారి డైరెక్షన్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్..ఇలా బెస్ట్ ఆర్టిస్ట్ లు, బెస్ట్ టెక్నిషియన్స్‌తో కూడిన సినిమా ఇది. మంచి పొలిటికల్ డ్రామా ఉన్న సినిమా. తమిళ్లో క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు కూడా అభినందించారు. ఇక తెలుగు సెన్సార్‌కి రెడీగా ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి ప్రొడ్యూసర్ ప్రభు గారు మా మీద బాధ్యత ఉంచారు. ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఈ సినిమా తెలుగులో మే 31 అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. మా బ్యానేర్లో కూడా ‘అధినేత’ సినిమా వచ్చింది. తరువాత ‘లీడర్’ ,’భరత్ అనే నేను’ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. పొలిటికల్ సబ్జెక్టు అనేది యూనివర్సల్ సబ్జెక్టు కాబట్టి తప్పకుండా ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలానే సూర్య గారి సినిమాలకి మన రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సిస్టమ్‌లో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ఒక యువకుడు పొలిటికల్ సిస్టమ్ మీద ఎలాంటి పోరాటం చేసాడు అనేది మెయిన్ పాయింట్. మా బ్యానేర్లో ఇంతవరకు డబ్బింగ్ సినిమా విడుదల చేయలేదు. ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను చేస్తున్నాం. అందులోను మే31 అనేది మంచిడేట్. ‘ఎన్.జి.కె’ టెక్నికల్‌గా హై క్వాలిటీలో ఉంటుంది. సూర్య గజిని, యముడు, సింగం సినిమాల్ల ఎన్. జి. కె కూడా పెద్ద హిట్ అవుతుంది” అన్నారు.
సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., ఆర్ట్: ఆర్.కె.విజయ్ మురుగన్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ.