Hyderabad: అనేక రంగాల్లో మహిళలు రాణించేలా ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్న నారీసేన గ్లోబల్ సంస్థ పురస్కారాలను మెగా కోడలు, ఎంటర్ ప్రెన్యూర్ ఉపాసన కొణిదెల అందించారు. హైదరాబాద్ హైటెక్స్ లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాసనతో పాటు Hyderabad సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అతిథులుగా పాల్గొన్నారు. వ్యాపారం, వినోదం, విద్య లాంటి వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన నారీమణులను ఈ సందర్భంగా సత్కరించారు. జీవితంలో భయాలను ఎదుర్కొన్నప్పుడే మహిళలు తాము ఎంచుకున్న రంగంలో విజయాలు సాధించగలరని అతిథులు పేర్కొన్నారు.
Hyderabad “నారీసేన గ్లోబల్” సంస్థకు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో 6 వేల మంది సభ్యులు ఉన్నారు. ఆన్ లైన్ లో వివిధ కోర్సులను నేర్పిస్తూ..మహిళలను సాధికారత దిశగా అడుగులు వేయిస్తోందీ సంస్థ. మహిళలు ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడే సమష్టిగా ఎదగగలరని నిరూపిస్తోందీ నారీసేన గ్లోబల్ సంస్థ. మహిళా శక్తి తోనే సమాజంలో మార్పు సాధ్యమన్నది ఈ సంస్థ నిరూపిస్తున్న నిజం.