Director Venkikudumula: టాలీవుడ్ ఇండస్ట్రీకి యంగ్ హీరో నాగశౌర్య నటించిన ఛలో మూవీతో దర్శకుడిగా వెంకీ కుడుములు పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో వెంకీ కుడుములు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నితిన్ హీరోగా భీష్మ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ వెంకీ కుడుములు.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.. దీంతో డైరెక్టర్ వెంకీ కుడుములు ప్రేక్షకులకు, టాలీవుడ్ ఇండస్ట్రీకి మరింత దగ్గరయ్యాడుDirector Venkikudumula. అయితే ఈ డైరెక్టర్‌ను సైబర్ నేరగాళ్లు ఓ అవార్డు పేరిట మోసం చేశారు. రూ.63వేలు వెంకీ కుడుములు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
దీంతో సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం డైరెక్టర్ వెంకీ కుడుములకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. భీష్మ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవానికి, పురస్కారాలకు ఎంపికైందని తెలిపారు. ఏయే విభాగాల్లో అవార్డులకు ఎంపికైందో కూడా వివరించాడు.. ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం ఒక్కో విభాగానికి రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుందని.. మొత్తం రూ.63వేలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. దీంతో అనుమానం వచ్చి తాను మోసపోయానని తెలుసుకోని నిన్న సాయంత్రం సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారుDirector Venkikudumula.