NationalNews: క‌ళ్లు మూసుకుని రూబిక్స్ క్యూబ్ 17సెక‌న్ల‌లోనే.. కుర్రోడికి స‌చిన్ ఫిదా!

NationalNews: స‌చిన్ టెండూల్క‌ర్ ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. క్రికెట్‌లో ఆయ‌న‌ను దేవుడిలా ఆరాధిస్తారు అభిమానులు.. మ‌రోవైపు స‌చిన్ త‌న‌కు ఏదైనా న‌చ్చిన అంశం ఉంటే త్వ‌ర‌గా సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేస్తాడు. దీంతో సోష‌ల్ మీడియాలో స‌చిన్ ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు.. గ‌తంలో ముంబైలోని ఒక ప్రాంతంకు వెళ్లి రూటు తెలియ‌క ఓ ఆటో డ్రైవ‌ర్‌ను అడిగి తెలుసుకున్నాడు.. ఆ ఆటో డ్రైవ‌ర్ కేవ‌లం ప్ర‌ధార ర‌హ‌దారి అడ్ర‌స్ చెప్పడం కాకుండా.. ద‌గ్గ‌రుండి చూపించారు. దీంతో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు స‌చిన్‌.. ఇక తాజాగా NationalNewsముంబైకి చెందిన కుర్రోడు మ‌హ్మద్ అమ‌న్ కొలీ.. క‌ళ్లు మూసుకుని కేవ‌లం 17 సెక‌న్ల‌లోనే రూబిక్స్ క్యూబ్‌ను సెట్ చేసి స‌చిన్ ను ఫిదా చేశాడు.

sachin Latest news

దీనికి సంబంధించి వీడియోను స్వ‌యంగా స‌చిన్ తీసి.. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. త‌నతో పాటు ఇక్క‌డ అమ‌న్ కొలి ఉన్నాడ‌ని.. అత‌డికి రూబిక్స్ క్యూబ్ ఇస్తాన‌ని.. అయితే చూడ‌కుండానే రూబిక్స్ క్యూబ్ సెట్ చేస్తాడ‌ని ఆ వీడియోలో తెలిపాడు స‌చిన్‌.. అలాగే ఈ కుర్రోడు గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించాడ‌ని వివ‌రించారు స‌చిన్‌. త‌న‌కు కూడా నీలాగా రూబిక్ క్యూబ్ సెట్ చేయ‌డం నేర్పించాలని ఆ కుర్రోడిని అడిగాడుNationalNews.