Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ చిత్రం ఈ రోజు ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింద. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో.. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో నితిన్ సరసన వింక్‌గాళ్ ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్ నటించింది. అలాగే ఈ సినిమాలో ఫిట్‌నెస్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ ఓ కీలకపాత్రను పోషించింది. అయితే చెస్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం.. భీష్మ చిత్ర విజయం తర్వాత నితిన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు చెక్ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ రోజు Tollywoodచెక్ చిత్రం రిలీజ్ అయింది.. మరీ ఈ చిత్రం ఎలా ఉంది.. నితిన్ నటన ఎలా ఉంది ఒక్కసారి చూద్దాం..
నగరంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌లో చాలా మంది మరణిస్తారు. ఆ కేసులో చేయని నేరానికి ఉగ్రవాది ఖైదీగా ఆదిత్య (నితిన్). ఉరిశిక్ష పడటంతో రోజులు లెక్కపెడుతుంటాడు. ఆ శిక్ష నుంచి బయటపడ్డాడానికి క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తుంటాడు ఆదిత్య. అదే టైంలో జైలులో శివన్నారాయణ(సాయిచంద్) ఆదిత్యలోని టాలెంట్‌ను గుర్తించి చెస్ నేర్పుతాడు. కాగా మరికొన్ని గంటల్లో ఉరికంబం ఎక్కాల్సిన ఆదిత్య జైలు నుంచి ఎలా బయటపడ్డాడు? అందుకు తాను నేర్చుకున్న చెస్ ఎలా సాయపడింది. ఈ కథలో ప్రియా ప్రకాశ్ వారియర్ ఎవరు? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో నితిన్ నటుడిగా విలక్షణ పాత్రను ఎంచుకున్నాడు. తనలోని ఓ కొత్త నటుడ్ని ఈ సినిమాలో చూపించాడు. సినిమా మొత్తం జైలులోనే ఉండడంతో నితిన్ ఒకేరకం క్యాస్ట్యూమ్‌తో కనిపిస్తాడు. జైలులో అనుభవిస్తున్న ఖైదీ.. తనలో ఆత్మస్థైర్యం నింపుకుని గ్రాంగ్ మాస్టర్ అయ్యే పాత్రలో నితిన్ ఎంతో ఒదిగిపోయాడు. నటుడిగా నితిన్‌కు మంచి గుర్తింపు తెచ్చే పాత్రను చెక్ చిత్రం ద్వారా లభిస్తుంది. ఇక Tollywoodరకుల్ ప్రీత్‌సింగ్ గ్లామర్ పక్కన పెట్టి లాయర్ మానసగా ఉన్నంతో బాగానే ఆకట్టుకుంటుంది. మరీ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ విషయానికొస్తే.. తెర మీద కనిపించినంతసేపూ గ్లామర్‌తో ఫిదా చేసింది. సాయిచంద్, సంపత్, హర్షవర్ధన్, మురళీశర్మ, సంపత్‌రాజ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. కల్యాణి మాలిక్ ఇచ్చిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా, వివేక్ కళా ప్రతిభ తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. కాగా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మార్క్ కథనం ఇందులో తక్కువ ప్రభావమే చూపించింది. నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి.. చివరకు చెక్ చిత్రం ఓ మంచి ప్రయత్నం.. కానీ బాక్సాఫీస్ వద్ద చెక్ పెట్టే రేంజ్‌లో ఈ చెక్ లేదుTollywood.