Mohanbabu: డైలాగ్‌కింగ్‌కు జోడీగా ప్ర‌ముఖ హీరోయిన్‌..

Mohanbabu: టాలీవుడ్ డైలాంగ్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌న్నాఫ్ ఇండియా. ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో రూపొందిస్తుండ‌గా.. 24ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, శ్రీ‌ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి పోస్ట‌ర్ల్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది.

Son of india

కాగా తాజాగా ఈసినిమా గురించి మ‌రో అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇందులో Mohanbabuమోహ‌న్‌బాబు స‌ర‌స‌న ప్ర‌ముఖ సీనియ‌ర్ హీరోయిన్ మీనా న‌టిస్తున్నట్లు వార్తాలు వెలువ‌డుతున్నాయి. తాజాగా మీనా న‌టించిన మ‌ల‌యాళం చిత్రం దృశ్యం2 సినిమాతో మ‌రో సూప‌ర్‌హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది.. గ‌తంలో Mohanbabuమోహ‌న్‌బాబు, మీనా కాంబినేష‌న్‌లో ప‌లు చిత్రాలు విజ‌యాలు ద‌క్కిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు.