Tollywood: వరలక్ష్మీ శరత్‌కుమార్ పేరు వింటే తమిళనాడులో లేడీ ఫైర్ బ్రాండ్ అనే గుర్తింపు ఉంది. ఆమె తమిళ్లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. వ్యక్తిగతంగా ఆమె ముక్కుసూటి మనిషి అని గుర్తింపు ఉంది. ఏదైనా విషయాన్ని దాచిపెట్టకుండా నేరుగా చెప్పె గట్స్ ఉన్నా లేడీ ఫైర్ బ్రాండ్ తమిళనాడులో గుర్తింపు సంపాదించుకుంది వరలక్ష్మీ శరత్‌కుమార్. అయితే తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఆమె నటించింది. ఇక్కడ నెమ్మదిగా ఆలోచించండి.. ఎందుకంటే ఆమె నటించినTollywood తెలుగు చిత్రాలు ఓ రేంజ్లో బ్లాక్‌బస్టర్ అయ్యాయి. దీంతో తమిళ్ కంటే తెలుగులో ఆమె నటిగా ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన క్రాక్ చిత్రంలో జయమ్మ పాత్రను పోషించిన వరలక్ష్మీ..
తెలుగు ప్రేక్షకుల్లో జయమ్మగా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రం అనంతరం నరేశ్ నటించిన నాంది సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ లాయర్పాత్రను పోషించింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది వరూ. దీంతో ఈ ఏడాది ప్రారంభంలోనే తెలుగులో రెండు విజయాలు సొంతం చేసుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సందర్బంగా నాంది విజయం పట్ల ఆమె స్పందిస్తూ.. నటిగా తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 9సంవత్సరాలైంది. కానీ Tollywoodతెలుగులో లభించినంత ఆదరణ కోలీవుడ్‌లో రాలేదు. నా సినిమాలు చూసి తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని చాలా మంది చెప్పేవాళ్లు. నిజంగానే అర్థమైందని ఈ సినిమాలు చేస్తే నాకనిపించింది. నాంది సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. ఈ చిత్రబృందానికి ధన్యవాదాలు. ఇటీవలే ఈ సినిమాను చెన్నైలో మా అమ్మతో కలిసి సినిమాను చూశాను. సినిమా చూస్తున్నంతసేపు మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నేను తమిళ్లో హీరోయిన్గా నటించిన తారై తప్పట్టై అనే చిత్రం తర్వాత ఈ చిత్రం చూసే మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుందని వరలక్ష్మీ పేర్కొన్నారు.