Rashmika: ముంబైలో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన ర‌ష్మిక మంద‌న్నా..

Rashmika: క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మికా మంద‌న్నా ఛ‌లో మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. ఈ చిత్రానికి వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో.. నాగ‌శౌర్య హీరోగా తెర‌కెక్కింది. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. దీంతో ప్రేక్ష‌కుల‌కు ఈ బ్యూటీపై మ‌న‌సు ప‌డింది. ఈ సినిమా అనంత‌రం విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన గీతాగోవిందం సినిమాలో ర‌ష్మికా హీరోయిన్‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. త‌న అందంతో పాటు త‌న హావాభావాలు, మ‌రీ ముఖ్యంగా విజ‌య్‌- Rashmikaర‌ష్మికా కెమిస్ట్రీ ఈ సినిమా భారీ విజ‌యం ద‌క్కింది. ర‌ష్మికా ఏకంగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు స‌ర‌స‌న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో హీరోయిన్‌గా చేసి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.

Rashmika Mandanna

దీంతో ప‌లు భాష‌ల్లో ఆమె భారీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మ‌ల్హొత్రా న‌టిస్తున్న మిష‌న్ మ‌జ్ను చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది ర‌ష్మికRashmika‌. దీంతో ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంది ర‌ష్మికా. అలాగే బాలీవుడ్ లెజండ‌రీ అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న డెడ్లీ చిత్రంలో ర‌ష్మికా న‌టిస్తోంది. అయితే ఇటీవ‌లే రిలీజ్ అయిన టాప్‌ట‌క్క‌ర్ వీడియో ఆల్బ‌మ్‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రించింది ఈ Rashmikaబ్యూటీ. ‌దీంతో బాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఆమె హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.. ఈ క్ర‌మంలోనే వ‌రుస‌గా బాలీవుడ్ అవ‌కాశాలు రావ‌డంతో బాంబేలోని సెలెబ్రిటీలు ఉండే బాంద్రాలో ఓ ఇల్లును కొనుగోలు చేసింద‌ట ర‌ష్మికా. త్వ‌ర‌లోనే ఆ కొత్త ఇల్లు గృహ ప్ర‌వేశం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ర‌ష్మికా ప్ర‌స్తుతం తెలుగులో అల్లుఅర్జున్ పుష్ప సినిమాలో, త‌మిళ్‌లో కార్తీ స‌ర‌స‌న‌, బాలీవుడ్‌లోనూ ప‌లు చిత్రాల్లో న‌టిస్తుందిRashmika.