Karnataka: పాతికేళ్ల యువకుడు కర్నాటక మాండ్యా జిల్లాలోని కొడిడోడి గ్రామానికి చెందిన రామకృష్ణ(25) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాండ్యా పోలీసుల కథనం ప్రకారం.. రామకృష్ణకు కేజీఎఫ్ స్టార్ హీరో యశ్, Karnatakaకర్నాటక ప్రతిపక్ష లీడర్ సిద్దరామయ్యకు వీరాభినని తన చివరి కోరికలుగా అని డెత్ నోట్లో రాశాడు. అలాగే యశ్, సిద్దరామయ్య తన అంత్యక్రియలకు రావాలని ఆ లేఖలో కోరాడు. అయితే తాను చనిపోవడానికి కారణం కూడా తెలిపాడు.. తన తల్లికి ఓ మంచి కొడుకుగా, తన అన్నయ్యకు మంచి తమ్ముడిగా మారలేక తన జీవితంలో వైఫల్యం ఎదుర్కొన్నానని..తన ప్రేమను పొందడంలో కూడా విఫలమయ్యానని ఆ లేఖలో తెలిపాడు.
తాను జీవితంలో సాధించడానికి ఏమీ లేదని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అని నోట్లో తెలిపాడు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న సిద్దరామయ్య Karnatakaకొడిదొడ్డి గ్రామాన్ని సందర్శించి తన అభిమాని అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో అభిమానిని కలవడం చాలా బాధగా ఉంది. ఇంత చిన్నవయస్సులో ఎవరూ జీవితాన్ని ముగించాలని అనుకోరు అని అన్నారు. అలాగే హీరో యశ్ ఈKarnataka ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నటుడిగా మీ విజిల్స్, చప్పట్లు, కేరింతలు వినడానికి.. మీ ప్రేమను పొందడానికి ఇష్టపడతాము. కానీ మేం అభిమానుల నుంచి ఆశించేది ఇది కాదని ట్వీట్ చేశాడు. ఇక ఈ ఘటన పై Karnatakaమాండ్యా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.