Nithin: నితిన్ మ‌రో చిత్రం షురు‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్‌!

Nithin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి అనంత‌రం మాంచి జోష్ మీదున్నాడు. వ‌రుస సినిమాల‌తో పాటు తాను న‌టించిన చిత్రాల రిలీజ్ డేట్స్ అప్ప‌టిక‌ప్పుడే ప్ర‌క‌టిస్తున్నారు ప‌లు చిత్రాల ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఇక తాజాగా Nithinనితిన్ కెరీర్‌లో చేస్తున్న 30వ సినిమా. ఈ చిత్రాన్ని బాలీవుడ్ చిత్రం అంధాధున్ కు ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా న‌భా న‌టేష్ హీరోయిన్‌గా చేస్తుండ‌గా.. ఓ కీల‌క‌పాత్ర‌ల్లో మిల్క్‌బ్యూటీ త‌మన్నా న‌టిస్తుంది.

Nithin latest movie

మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పియానో ప్లేయ‌ర్‌గా Nithinనితిన్ క‌నిపించ‌నున్నారు. ఇక ఈ సినిమా జూన్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఇక ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంచితే Nithinనితిన్ తాను న‌టించిన చిత్రాలు.. రంగ్‌దే, చెక్ విడుద‌ల తేదీని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. Nithinనితిన్‌-కీర్తి సురేశ్ జంట‌గా రంగ్‌దే చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. అలాగే నితిన్‌-ప్రియాంక‌జ‌వాల్క‌ర్‌-ర‌కుల్‌ప్రీత్‌సింగ్ న‌టించిన చెక్ చిత్రాన్ని ఫిబ్ర‌వరి ‌26న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.