Megastar: కరోనా సమయంలో వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ప్రజల కోసం నిరంతరం శ్రమించిన విషయం తెలిసిందే. కుటుంబాలకు దూరంగా ఉండి విధులు నిర్వర్తించారు. వీరిలో వైద్యుల సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కనిపించే దేవుళ్లు వైద్యులు అంటారు. దేవుడు ప్రాణం పోస్తే వైద్యుడు ప్రజల ఆరోగ్యం కాపాడుతాడు.. కరోనా సమయంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మాత్రం తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందిస్తూ వారిలో మనోధైర్యం నింపారు. అయితే తాజాగా వైద్యుల నిరంతర కృషిని అభినందించిన Megastarమెగాస్టార్ చిరంజీవి..
ఆయన గురువారం హైదరాబాద్లోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్కు వెళ్లి.. వైద్య సిబ్బందితో కలిసి ఫోటోలు దిగారు. ఈ క్రమంలో వీటికి సంబంధించిన ఫోటోలను Megastarచిరంజీవి తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి అక్కడి వైద్యులను కలిసే అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది చేసిన సేవ ఎంతో గొప్పది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎంతో చాకచక్యంగా ఏఐజీ ఆసుపత్రిని ముందుకు తీసుకువెళ్లిన పద్మభూషణ్ అవార్డు గ్రహిత హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు Megastar చిరంజీవి. ఇదిలా ఉంచితే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం కొరటాల శివ డైరెక్ట్ చేయగా.. ఇందులో కాజల్, రాంచరణ్, సోనూసూద్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.