Tollywood: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన మురారి సినిమా నేటితో 20ఏళ్లు గడిచింది. ఈ చిత్రాన్ని కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేశ్‌బాబు సరసన సోనాలిబింద్రే కథానాయికగా నటించింది. 2001లో ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ సినిమా గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కృష్ణవంశీ తెలుపుతూ.. ఒక దేవత కోపానికి కారణమైన వ్యక్తి ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడన్న దాని నుంచి అనుకుని మురారి కథను డెవలప్ చేశాం అని చెప్పారు. ఈ సినిమాకు టైటిల్ పెట్టడానికి కారణం.. మహేశ్‌బాబు చూడగ్గానే బృందావనం గుర్తొచ్చింది. అందుకే మురారి అని పెట్టాం అని కృష్ణవంశీ తెలిపారు.
Tollywoodఅయితే మహేశ్‌బాబు ఈ చిత్రం ముందు యువరాజు, వంశీ లాంటి చిత్రాల్లో నటించారు. కానీ ఈ చిత్రాలు ప్రేక్షకులకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఈ చిత్రాల తర్వాత వచ్చిన మురారి చిత్రం మహేశ్ కెరీర్‌లోనే మంచి చిత్రంగా నిలిచింది. ఇక Tollywoodమురారి చిత్రంలో కథాంశం, కుటుంబ భావోద్వేగాలు, మణిశర్మ సంగీతం ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను ఎంతో మెప్పించింది. దాని ఫలితమే బాక్సాఫీస్ వద్ద సునామీ కురిపించింది. నిజానికి ఈ సినిమా కథ నిజజీవిత సంఘటన ఆధారంగా తీశారు. ఈ సినిమా మహేశ్ కెరీర్‌లోనే తొలి సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచింది. కేవలం 5కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన Tollywoodఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక మురారి సినిమా పరంగానే కాకుండా.. మ్యూజికల్ గా ఎంతో హిట్ అయింది. Tollywood ఈ చిత్రంలోని అలనాటి రాముచంద్రుడి పాట ప్రతి పెళ్లి ఫంక్షన్లలో మార్మోగుతూనే ఉంటుంది.