RRR: ఆర్ఆర్ఆర్ హ‌క్కుల‌ను సంపాదించుకున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్‌..

RRR: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో కొమురం భీంగా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రాంచ‌ర‌ణ్ పాత్ర‌లు పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభ‌ట్ చ‌ర‌ణ్‌కు జోడీగా న‌టిస్తుండ‌గా.. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ న‌టి ఒలీవియా మోరీస్ న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ అజ‌య్‌దేవ్‌గ‌ణ్ ఈ చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. అయితే RRRఈ చిత్రం నుంచి మ‌రో అప్‌డేట్ వ‌చ్చింది.. త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన థియేట‌ర్ హ‌క్కులు సొంతం చేసుకుంది.

RRR lyka productions

గ‌తంలో చిరంజీవి న‌టించిన ఖైదీ నెం150తో పాటు రోబో2.0, ద‌ర్బార్ వంటి భారీ చిత్రాల‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఈ సంస్థ వ్య‌వ‌హ‌రించింది. అయితే ఈ విష‌యంపై లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఆనందం వ్య‌క్తం చేసింది. RRRఈ భారీ పాన్ ఇండియా సినిమా హ‌క్కులు సొంతం చేసుకున్నామ‌ని గ‌ర్వంగా ప్ర‌క‌టిస్తున్నాం అని నిర్మాణ సంస్థ ట్విట్ట‌ర్‌లో తెలిపింది. దీనికి సంబంధించిన విష‌యాన్ని ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక ఈ చిత్రాన్ని దాదాపు రూ.400కోట్లు బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా.. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇక RRRఈ చిత్రానికి ‌‌ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు కీర‌వాణీ స్వరాలు అందిస్తుండ‌గా.. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న ఈRRR చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.‌