బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా రెండో పెళ్లి సిద్ధమైంది. గతంలో ఆమె ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్మెన్ సాహిల్ సంఘాతో ఆమె చాలా రోజులు డేటింగ్ చేసిన అనంతరం 2014లో అతడిని పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల తర్వాత 2019లో అతడితో విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్నా కూడా తాము స్నేహపూర్వకంగా ఉన్నట్లు వెల్లడించింది.
అయితే ముంబైకి చెందిన మరో బిజినెస్మెన్ వైభవ్ రేఖీని గత కొంతకాలంగా దియా మీర్జా డేటింగ్లో ఉంది. ఈ క్రమంలో అతడిని పెళ్లిచేసుకోవాలని దియామీర్జా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15న వీరి పెళ్లి ఉంటుందని సమాచారం. ఈ పెళ్లికి రెండు కుంటుంబాలకు చెందిన బంధుమిత్రులు మాత్రమే హాజరుకానున్నారట.