‘ఉప్పెన’ రిలీజ్.. తమ్ముడికి ఉద్వేగంతో సాయిధరమ్ తేజ్ లేఖ

మెగా కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు రాగా.. ఇప్పుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. రోటిన్ కథ అయినా.. స్క్రీన్ ప్లే, పాటలు, విజయ్ సేతుపతి నటన బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు.

SAIDHARAM TEJ ABOUT VAISHNAV TEJ

ఉప్పెన రిలీజ్ అయిన సందర్భంగా తన తమ్ముడు వైష్ణవ్ తేజ్‌కి సాయిధరమ్ తేజ్ ఒక ఎమోషనల్ లేఖ రాశాడు. ‘తమ్ముడూ.. ఫైనల్ గా నీ సినిమా రిలీజ్ కాబోతోంది. నాకు చాలా ఆనందంగానే కాదు.. గర్వంగా కూడా ఉంది. నిన్నటికి నిన్న చిన్నపిల్లోడివి.. ఇవాళ వెండి తెరపై కనిపించబోతున్నావు. నాకు తెలుసు.. నీలో కొంత ఆందోళన.. మరింత ఎగ్జైట్ మెంట్ ఉన్నాయి. నా మొదటి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు నేను కూడా ఇలాగే ఉన్నాను. నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. అయితే.. అంతా సాఫీగా సాగుతుందని చెప్పలేను. కానీ.. ప్రేక్షకుల నుంచి అంతులేని ప్రేమను మాత్రం నువ్వు పొందుతావు. నీకు ఇదొక గొప్ప రోజు. నీకే కాదు మాక్కూడా. ఉప్పెన యూనిట్ కు నా శుభాకాంక్షలు. నిన్ను తెరపై చూసేందుకు నేను వెయిట్ చేయలేకపోతున్నాను’ సాయితేజ్ తన లేఖలో రాశాడు.