Bollywood: “ట‌క్క‌ర్ ట‌క్క‌ర్‌ టాప్‌ట‌క్క‌ర్” అంటూ ర‌ష్మిక హాల్‌చ‌ల్‌!

Bollywood: ర‌ష్మిక మంద‌న్నా ఛ‌లో మూవీతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌యిన విష‌యం తెలిసిందే. నిజంగా ఎలా దొర‌క‌పట్టారో ఈ క‌న్న‌డ బ్యూటీని తొలి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఫిధా చేసింది. అలాగే విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా గీతాగోవిందం సినిమాలో హీరోయిన్‌గా న‌టించి మ‌రింత ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది ఈ భామ‌. ఈ సినిమాలో త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కార‌ను పిచ్చేక్కించేలా చేసింది ర‌ష్మిక‌. అనంతరం ఏకంగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు చిత్రంలో అవ‌కాశం ద‌క్కించుకుంది ఈ భామ‌.

toptucker

స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ర‌ష్మిక ఓ రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకుంది. దీంతో తెలుగులోనే కాకుండా Bollywood బాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుంచి అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌ష్మిక న‌టిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా మిష‌న్ మ‌జ్ను చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా Bollywood టాప్‌ట‌క్క‌ర్ అంటూ వీడియో ఆల్బ‌మ్‌లో రెచ్చిపోతుంది ర‌ష్మిక మంద‌న్నా. ప్ర‌ముఖ Bollywood బాలీవుడ్ సింగ‌ర్ బాద్‌షా, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్‌శంక‌ర్ రాజా క‌లిసి టాప్ ట‌క్క‌ర్ అనే వీడియో ఆల్బ‌మ్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఇందులో ర‌ష్మిక త‌న అందాల‌తో వేడేక్కెంచేసింది. హాట్ హాట్ కాస్ట్యూమ్స్‌తో రెచ్చిపోయింది ఈ భామ‌. ప్ర‌స్తుతం ఈ వీడియో ఆల్బ‌మ్ సోష‌ల్ మీడియాలో హాల్‌చ‌ల్ చేస్తోంది.