తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌పై చెన్నై ఎగ్మోర్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతంలో రోబో కథ తనదేనంటూ ఆరూర్ తమిళ్‌నాథన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. జిగుబా అనే తన కథను 1996వ సంవత్సరంలో తొలిసారి తమిళ పత్రికలో ప్రచురించానని, ఆ తర్వాత 2007లో ధిక్ ధిక్ దీపికా దీపికా అనే నవలగా వచ్చిందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దానిని ఆధారంగా తీసుకుని శంకర్ రోబో కథ రాసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. శంకర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై శంకర్ స్పందించాడు. తనపై వారెంట్ జారీ అయిందనే వార్తలు అవాస్తవమని, మీడియా అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. ఆన్లైన్ కోర్టు రిపోర్టింగ్‌లో లోపం కారణంగా అలా ఇలా జరిగిందని చెప్పాడు. తన లాయర్ దీనిపై కోర్టును సంప్రదించగా.. అసలు విషయం బయటపడిందని చెప్పాడు.