బాలయ్య-బోయపాటి సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోకు ఛాన్స్?

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో రానున్న BB3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో.. ఈ హిట్ కాంబినేషన్‌లో రానున్న ఈ మూడో సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన బాలయ్య పోస్టర్స్, డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టకుంది.

NAGASOURYA IN BB3 MOVIE

అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉంటుందని, ఆ పాత్రలో నాగశౌర్య నటించనున్నాడని వార్తలొస్తున్నారు. ఆ పాత్ర ఉండేది కొంచెం సేపు అయినా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఆ పాత్రలో నటించేందుకు నాగశౌర్య ఒకే చెప్పినట్లు సమాచారం.