Thamilanadu: ఎంజీఆర్ అంటే తమిళనాడులో లెజండరీ నటుడు అనే గుర్తింపు ఉంది. మన తెలుగులో ఎన్టీఆర్ లాగే సినీ రంగంలో గొప్ప స్థాయిని అందుకుని.. ఆపై రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి జనాల హృదయాల్ని గెలిచారు ఎంజీఆర్. ఎంజీఆర్‌ను తమిళనాడు ప్రజలు దేవుడిలా ఆరాధిస్తారు. అలాగే నటి, అన్నా డీఎంకే సీఎం దివంగత జయలలిత కూడా Thamilanadu తమిళనాడు ప్రజలు ఆరాధ్య దైవంగా భావిస్తారు. సంధ్య పేరుతో జయలలిత ప్రముఖ నటిగా వెలుగొందారు.
జయ రెండేళ్ల వయసుల్లోనే ఆమె తండ్రి మరణించారు. దీంతో బెంగుళూరులోని అమ్మమ్మ వాళ్లింట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక జయలలిత తల్లి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండడంతో చిన్నతనంలో జయలలిత తల్లితండ్రుల ప్రేమను కోల్పోయారు. దీంతో జయలలిత కూడా సినిమాల్లో బాల నటిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సినీ రంగంలో రాణించిన జయ.. జీవితం పూర్తిగా మారిపోయింది మాత్రం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే అనే చెప్పాలి. సినిమాల్లో నటించేటప్పుడే ఎంజీఆర్‌తో పరిచయం ఏర్పడడంతో జయలలిత లైఫ్ టర్నింగ్ పాయింట్. 1997లో Thamilanadu తమిళనాడుకు ఎంజీఆర్ (ఎం జి రామచంద్రన్) ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టగా.. ఎంజిఆర్ ప్రోత్సాహంతోనే 1982లో అన్నాడీఎంకే పార్టీలో చేరారు. దీంతో రాజకీయాల్లో కూడా జయలలిత తమిళనాడులో ప్రజల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. జయలలిత రాజకీయ గురువు ఎంజీఆరే.. జయలలిత చిన్ననాటి నుంచే ధృడ సంకల్పంతో, పడిలేచిన కెరటంలా దూసుకుపోయారు. Thamilanadu తమిళనాడు రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. అయితే ఎంజీఆర్, జయలలిత వీరిద్దరు చేసిన సేవలకు, తమిళనాడు ప్రజలు దేవుళ్లుగా ఆరాధిస్తారు. ఈనేపథ్యంలోనే.. తాజాగా వీరిద్దరి దేవాలయాన్ని మధురైలోని ల్లుపట్టిలో విశాలమైన స్థలంలో రూ.50లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ ఆలయంలో ఎంజీఆర్, జయలలితల కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయగా.. జయలలిత కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఉదయ్‌కుమార్ ఈ ఆలయాన్ని నిర్మించారు. దీంతో నేడు ఈ ఆలయాన్ని Thamilanadu తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రారంభించనున్నారు.