లాక్డౌన్తో షూటింగ్లు ఆగిపోవడం, థియేటర్లు మూతపడటంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర నష్టాల పాలైంది. అయితే లాక్డౌన్ తర్వాత సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వడం, థియేటర్లు తెరుచుకోవడంతో ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కోలుకుంటోంది. లాక్డౌన్లో ఆగిపోయిన సినిమాలన్నీ ఇప్పుడు విడుదల అవుతుండటంతో.. సినీ పరిశ్రమకు కొత్త కళను సంతరించుకుంది. పెద్ద హీరోల సినిమాలకు కూడా విడుదలకు రెడీ అవుతుండటంతో.. ఈ ఇయర్ సినీ పరిశ్రమకు గుడ్ ఇయర్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్లను మేకర్స్ ప్రకటిస్తున్నారు. రానా హీరోగా వస్తున్న విరాటపర్వం సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిందీ పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్, నేచరల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’, అక్కినేని నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, గోపీచంద్ ‘సీటిమార్’ఏప్రిల్లో వరుసగా విడుదల కానున్నాయి. ఒకే నెలలో ఐదు సినిమాలు విడుదల అవుతుండటంతో.. సినీ అభిమానులు ఆనందంలో ఉన్నారు.