Hollywood: హలీవుడ్ నటి పమేలా అండర్సన్(53)కు తన బాడీగార్డు డాన్ హేరస్ట్తో వివాహం జరిగింది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైందని పలు కథనాలు వెలువడ్డాయి.. ఈ విషయంపై తానే స్వయంగా సోషల్‌మీడియాలో తెలిపింది నటి పమేలా.. కాగా ఈ వివాహం ఆమెకు ఆరో వివాహం.. తొలుత ఆమె 1995లో టామీ లీని పెళ్లాడి అతడితో ఇద్దరు పిల్లల్ని కన్నారు. Hollywood వారు 1998లో వీరిద్దరు విడిపోగా..
2006లో పమేలా సింగర్ కిడ్ రాక్తో వివాహం జరిగింది. ఆ ఏడాదే వారిద్దరూ విడిపోయారు. మళ్లీ 2007లో రిక్ సాల్మన్‌ను పెళ్లాడిన పమేలా కొద్ది రోజుల్లోనే వారిద్దరి బంధం తెగిపోయింది. ఇక 2020లో ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్‌ను పమేలా పెళ్లి చేసుకుని కేవలం 12రోజులకే ఆయనతో సంబంధం తెంచుకుంది. ఇక ఇప్పుడు Hollywood తాజాగా తన బాడీగార్డ్ డాన్ హేరస్ట్‌ను పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించింది. తన భర్తతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తి చేతిలో ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నానని ఖచ్చితంగా చెప్పగలను.. అతడితో కలిసి ఉన్న ఈ ఒక్క ఏడాది నాకు ఏడు జన్మల బంధంగా అనిపిస్తోందని సోషల్ మీడియాలో రాసుకోచ్చిందిHollywood.