మరో బాలీవుడ్ డైరెక్టర్‌తో జతకట్టిన ప్రభాస్

ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్‌లో రానున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమాకు వర్క్ చేయనుండగా.. గ్రాఫిక్స్ వర్క్ ఇప్పటికే మొదలైంది. అవతార్ సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేయనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఇది విడుదల కానుంది.

prabhas movie with siddharth

అయితే మరో బాలీవుడ్ డైరెక్టర్‌తో పాన్ ఇండియా మూవీ చేసేందుకు ప్రభాస్ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో ప్రభాస్ సినిమా చేయనున్నాడ. ప్రస్తుతం కథకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం షారూఖ్-దీపికా పదుకొణే డైరెక్షన్‌లో పఠాన్ అనే సినిమాను సిద్దార్థ్ తెరకెక్కిస్తున్నాడు. దీంతో పాటు హృతిక్-దీపిక కాంబోలో ఫైటర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.