జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా రూపొందుతున్న ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్లోని మరో ప్రధాన పాత్ర చిట్టిగా బేబి సహశ్రిత కనిపించనున్నది.
ఈ చిత్రంలోని తొలి పాటను ప్రముఖ ఆర్థోపెడీషియన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాన పాత్రధారి జగపతిబాబు మాట్లాడుతూ, తమ మూవీ ఫస్ట్ సాంగ్‌ను కొవిడ్ 19 మహమ్మారిపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో ఒకరైన డాక్టర్ గురవారెడ్డి విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నామని అన్నారు.
డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ, ‘ఎఫ్‌సీయూకే’ చిత్రంలోని పాటలు చాలా బాగున్నాయనీ, ఈ సినిమాను తిలకించేందుకు కుతూహలంతో ఎదురుచూస్తున్నాననీ అన్నారు. “ముఝ్సే సెల్ఫీ లేలో..” అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసిన ఆయన, ట్యూన్స్‌కు తగ్గట్టు ఆ పాటను ఆలపించడం గమనార్హం.
నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, పాటలను సినీ స్టార్లతో కాకుండా కొవిడ్ హీరోల చేతుల మీదుగా రిలీజ్ చేయించడమనేది తమ ప్రాణాలను పణంగా పెట్టి వారు చేస్తున్న గొప్ప సేవలకు తాము తెలుపుతున్న చిన్నపాటి కృతజ్ఞత అని అన్నారు.
ఈ గీతాన్ని చిత్రంలోని యువజంట కార్తీక్, అమ్ము అభిరామి లపై చిత్రీకరించారు. నకాష్ అజీజ్, దివ్య భట్ లు ఆలపించిన ఈ గీతానికి ఆదిత్య సాహిత్యం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో ఈ గీతానికి అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.
ఫిబ్రవరి 6న “ముఝ్సే సెల్ఫీ లేలో..” పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ విద్యాసాగర్ రాజు ప్రకటించారు. తొలి పాటను విడుదల చేసిన డాక్టర్ గురవారెడ్డికి హీరో రామ్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో ధన్యవాదాలు తెలిపారు.
తారాగణం:
జగపతిబాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహశ్రిత, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్.
సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూసర్: వాసు పరిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీకాంత్‌రెడ్డి పాతూరి
సహనిర్మాత: యలమంచిలి రామకోటేశ్వరరావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యానర్: శ్రీ రంజిత్ మూవీస్.