BIG BREAKING: ‘RRR’ రిలీజ్ డేట్ వచ్చేసింది

RRR RELEASE DATE:బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్-చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా.. రాంచరణ్ సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్, రాంచరణ్‌ల పాత్రలకు సంబంధించిన టీజర్లు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించాయి.

RRR RELEASE ON OCTOBER 13 2021

దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో RRR రిలీజ్ డేట్‌ను సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆఱ్ బైక్‌పై దూసుకెళ్తుండగా.. రాంచరణ్ గుర్రంపై ఉన్నాడు. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.