తెలుగులో ‘వేదం’ సినిమాలో కీలక పాత్రలో నటించింది లేఖ వాషింగ్టన్. ఆ తర్వాత తెలుగులో డైనమైట్ సినిమాలో నటించగా.. దీని తర్వాత ఇక తెలుగులో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు నటించింది. ఇప్పుడు ఈ మె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌తో వాషింగ్టన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
వాషింగ్టన్ లేఖ భర్తకు ఇమ్రాన్ ఖాన్ మంచి స్నేహితుడు. భర్త ద్వారా వాషింగ్టన్ లేఖకు ఇమ్రాన్ ఖాన్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంకు దారితీసింది. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు. అప్పటినుంచి వీరి బంధం మరింత బలపడింది. ప్రస్తుతం బాలీవుడ్లో వీరిద్దరి మధ్య ఎఫైర్ గురించి చర్చ జరుగుతోంది.