Kamal Haasan Discharged: హాస్పిటల్ నుంచి కమల్‌హాసన్ డిశ్చార్జ్

Kamal Haasan Discharged: చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ నుంచి లోకనాయకుడు కమల్‌హాసన్ డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కాలినొప్పితో కమల్ హాస్పిటల్‌లో చేరగా.. ఆయనకు వైద్యులు సర్జరీ నిర్వహించారు. సర్జరీ సక్సెస్ అవ్వగా.. గత కొద్దిరోజులుగా హాస్పిటల్‌లోనే కమల్ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా కమల్‌ ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందితో కలిసి కమల్ ఫొటోలు దిగారు.

KAMLAHASSAN DISCHARGE

ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే కొద్దిరోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని కమల్‌కు వైద్యులు సూచించారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో గత కొద్దినెలలుగా ఎన్నికల ప్రచారంలో కమల్ బిజీబిజీగా ఉన్నారు. భారీ బహిరంగ సభల్లో పాల్గొంటూ తన పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కాలినొప్పి రావడంతో గత కొద్దిరోజుల క్రితం హాస్పిటల్‌లో చేరారు.