kamal Haasan: త్వరలోనే వస్తా.. కమల్ ట్వీట్

kamal Haasan: లోకనాయకుడు కమల్‌హాసన్ కాలినొప్పితో చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్‌లో చేరగా.. ఇటీవల వైద్యులు ఆయన కాలికి సర్జరీ చేశారు. సర్జరీ సక్సెస్ అయిందని, త్వరలో కమల్ తిరిగి వస్తారని ఆయన కుమార్తెలు శృతిహాసన్, అక్షర ఒక ప్రకటన విడుదల చేశారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో కమల్ హాసన్ గత కొద్దినెలలుగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో కాలినొప్పి రావడంతో ఇటీవల హాస్పిటల్‌లో చేరారు.

KAMAL HASSAN TWEET ON HEALTH

2016లోనే చెన్నైలోని తన నివాసంలో కమల్ నడుస్తూ పడిపోయినప్పుడు కాలికి దెబ్బ తగిలింది. అప్పుడు కాలికి సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి కాలినొప్పి రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

తన ఆరోగ్యంపై తాజాగా కమల్ ట్విట్టర్‌లో స్పందించారు. సర్జరీ సక్సెస్ అయిందని, వైద్యులకు ధన్యవాదాలు అని చెప్పారు. త్వరలోనే కోలుకుని మళ్లీ ప్రజల ముందుకు వస్తానన్నారు.